గుడి ముంగిట దీపానివై నా ఎదలోతుల బృందావనివైనావు ...
విడి పడని బంధానివై నా హృదిసందిట ఆనందానివైనావు ...
తడి పెదవుల తడబాటువై నా మది మీటిన మందాకినివైనావు ....
నా అణువణువు లోను నీ ధ్యాసే...
మనసులో ముద్ర పడిన నీ రూపాన్ని ,
ప్రతిక్షణం స్మరిచాలానే నా ప్రయాస .
చెరగని చిరునవ్వులతో చిత్విలాసంగా నవ్వే నీకళ్ళు ...
నీ మనసు చెరలో నన్ను చిరకాలపు ఖైదీని చేసాయి
కరుణ నిండిన ఆ కళ్ళకి కంటిపాపై కావలి కాస్త.
నువ్వు చూడలేని ప్రపంచాన్ని నాకు చూపించావు.
నువు లేని ఈ లోకాన్ని వీడోద్దని శాసించి వెళ్లావు...
నాకు తోడుగా.....నీ నీడగా "నీ చూపుని" మాత్రం నాకు వరంగా మిగిల్చావు......