చెలీ,
చెంపకు చారెడు కన్నులున్న నీవు,
నా...............................................
కనులకి కలల కాటుకవా !
తలపులకి వలపు వాకిటవా !
చీకటి తెరలకు వేకువవా !
మాపటి ఊహకు తూరుపువా !
చిలిపి ఆశలవేల ఆమనివా !
కలల కోరికల మేలకువవా !
మౌనభాష్యాన మధుర గీతికవా !
మేని మలుపుల అధర కావ్యానివా !
ఏమని చెప్పను.............................
నా మదినేలెడి మాలినివని చెప్పనా,
నా వ్యధ తీర్చే వరూదినివని చెప్పనా,
నా హృది వాకిట వేన్నేలవని చెప్పనా,
నా తలపుల తలుపులు తెరిచే తాపసివని చెప్పనా,
నా కవితల కెరటాలు వలచె కావ్యానివని చెప్పనా,
నా కనుల ముంగిట్లో కలల నేలతవని చెప్పనా,
చెప్పనలవికాని ఈ భావాలకి భాష్యం చెప్పే భాష,
నావద్ద లేదని చెప్పనా !
roju roju ku mudiripothunnave basha lo!!!
ReplyDeletechala tanmayatvam tho rasukuntu veltunnav......
ReplyDeletemanchi basha..manchi prasa....gud
ReplyDeleteక్రుతగ్నురాలిని.
ReplyDeleteఇన్నాల్లలు తిన్నగా comment వ్రాసినన్దుకు.
భాషకందని భావాలెన్నో
ReplyDeleteమదిలో అక్షరరూపం దాల్చమంటే
మొరాయిస్తున్నాయి..
ఊహకందని ఆశలెన్నో
మదిలో ఊహల్నుండి వాస్తవానికి
రానంటున్నాయి..
ఎలా నా భావాలు ఆశలు నీ ముందుంచటం !!
na cheli gurinchi nenu anukunna vishayalu neeku ela telisayi..?
ReplyDeletetelepati raa
ReplyDelete'నా కనులకి కలల కాటుకవా..
ReplyDeleteనా తలపులకి వలపు వాకిటవా!..'
ఈ లైన్లు నాకు బాగా నచ్చాయి. కొన్నింటిని ఇంకా పదును పెడితే మరింత బాగుంటుందని నా అభిప్రాయం.