Wednesday, September 30, 2009

చెప్పనా?

చెలీ,
చెంపకు చారెడు కన్నులున్న నీవు,
నా...............................................
కనులకి కలల కాటుకవా !
తలపులకి వలపు వాకిటవా !
చీకటి తెరలకు వేకువవా !
మాపటి ఊహకు తూరుపువా !
చిలిపి ఆశలవేల ఆమనివా !
కలల కోరికల మేలకువవా !
మౌనభాష్యాన మధుర గీతికవా !
మేని మలుపుల అధర కావ్యానివా !

ఏమని చెప్పను.............................

నా మదినేలెడి మాలినివని చెప్పనా,
నా వ్యధ తీర్చే వరూదినివని చెప్పనా,
నా హృది వాకిట వేన్నేలవని చెప్పనా,
నా తలపుల తలుపులు తెరిచే తాపసివని చెప్పనా,
నా కవితల కెరటాలు వలచె కావ్యానివని చెప్పనా,
నా కనుల ముంగిట్లో కలల నేలతవని చెప్పనా,

చెప్పనలవికాని ఈ భావాలకి భాష్యం చెప్పే భాష,
నావద్ద లేదని చెప్పనా !

8 comments:

  1. roju roju ku mudiripothunnave basha lo!!!

    ReplyDelete
  2. chala tanmayatvam tho rasukuntu veltunnav......

    ReplyDelete
  3. manchi basha..manchi prasa....gud

    ReplyDelete
  4. క్రుతగ్నురాలిని.
    ఇన్నాల్లలు తిన్నగా comment వ్రాసినన్దుకు.

    ReplyDelete
  5. భాషకందని భావాలెన్నో
    మదిలో అక్షరరూపం దాల్చమంటే
    మొరాయిస్తున్నాయి..

    ఊహకందని ఆశలెన్నో
    మదిలో ఊహల్నుండి వాస్తవానికి
    రానంటున్నాయి..

    ఎలా నా భావాలు ఆశలు నీ ముందుంచటం !!

    ReplyDelete
  6. na cheli gurinchi nenu anukunna vishayalu neeku ela telisayi..?

    ReplyDelete
  7. 'నా కనులకి కలల కాటుకవా..
    నా తలపులకి వలపు వాకిటవా!..'

    ఈ లైన్లు నాకు బాగా నచ్చాయి. కొన్నింటిని ఇంకా పదును పెడితే మరింత బాగుంటుందని నా అభిప్రాయం.

    ReplyDelete